
నిత్య అన్నదానము: అన్ని దానములలోకెల్ల అన్నదానము మిన్న. ప్రయాగ క్షేత్రములో లక్షమందికి గాని, కాశీ మహాక్షేత్రములో 2 లక్షల మందికి గాని, పవిత్ర గంగానది ఒడ్డున 7 లక్షల మందికి గాని అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో అంతర్వేది శ్రీలక్షీనరసింహస్వామివారి క్షేత్రములో ఒక్కరికి అన్నదానం చేస్తే అంతటి మహాపుణ్యము కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నయి.
(బ్రహ్మపురాణాంతర్గత గౌతమీ మహత్యములోతెలియజేసియున్నది). వందలాది మైళ్ళ దూరమునుండి వ్యయ ప్రయాసలతో అలసి సొలసి వచ్చేభక్తులకు అన్నదానముతో సంతృప్తి పరచండి. నిరంతరం జరిగే ఈ నిత్య అన్నదాన పధకమునకు తమ శక్తి కొలతి విరాళములు ఇచ్చి మీరు మీ వంశపారంపర్యం ఆచంద్రతారార్కం పుణ్యాన్ని మరియు శ్రీస్వామివారి కృపాకటాక్షములు పొందుదురు.
"భిక్షాందేహీ కృపావలంబనకరీ...! మాతాన్నపూర్ణేశ్వరీ"...! సర్వమంగళ కారిణీ...! ఈశ్వర స్వరూపిణీ...! సాక్షాత్తు అన్నపూర్ణ దేవీ సమక్షంలో శ్రీ
లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నిత్య అన్న ప్రసాదము అక్షయముగా జరుగుతున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
అన్నదానమునకు మించిన దానము మరేది లేదు.
ఆకలిగొన్నవారికి అన్నము పెట్టడము ఒక సేవాకార్యమే కాక మానవుని కనీస ధర్మముగా మన దేశములో వేదకాలమునుండి పాటిస్తున్న ఆచారము. అన్నదాతను భగవత్స్వరూపునిగా భావిస్తారు.
S. No. |
Donation |
Description |
1 | Rs 1,00,000/- and Above | Donar will be called as "MAHARAJA POSHAKULU" |
2 | Rs 50,000/- and Above | Donar will be called as "RAJA POSHAKULU" |
3 | Rs 10,000/- and Above | Donar will be called as "POSHAKULU" |
4 | Rs 1116/- and Above | Donar will be called as "DATALU" |
"ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి" |
*If Devotees wants to deposits in Bank, then Please provide your details (Name, Address, Phone Number, Gotram, Birth Star, Payment Confirmation Slip) to eoantarvedi@gmail.com |
2016 © www.antarvedisrilakshminarasimhaswamy.com | Terms and Conditions |